Friday, February 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీపీఐ(ఎం) నుండి బాన్సువాడ పట్టణ కార్యదర్శి ఖలీల్ బహిష్కరణ

సీపీఐ(ఎం) నుండి బాన్సువాడ పట్టణ కార్యదర్శి ఖలీల్ బహిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ పట్టణ సీపీఐ(ఎం) కార్యదర్శిగా కొనసాగుతున్న ఖలీల్ పార్టీ రాజకీయ విధానానికి భిన్నంగా ప్రవర్తిస్తూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందున ఆయనను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు జిల్లా పార్టీ తీర్మానం చేసినట్లు శుక్రవారం వెల్లడించారు. ఖలీల్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు సీపీఐ(ఎం) అనుబంధ సంఘాలైన కార్మిక వర్గం సిఐటియు, అంగన్వాడి, ఆశా, గ్రామపంచాయతీ, మున్సిపల్ వర్కర్స్, అలాగే విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐతో ఆయనకు ఇకపై ఎటువంటి సంబంధం లేదని నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ విషయాన్ని పార్టీ శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, ఎస్ఎఫ్ఐ సభ్యులు, అంగన్వాడి, ఆశా కార్మికులు, మున్సిపల్, గ్రామపంచాయతీ సిబ్బంది, మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు, పార్టీ సభ్యులందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్. వెంకట్ గౌడ్, మోతిరా నాయక్, కొత్త నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -