Saturday, February 7, 2026
E-PAPER
Homeఆటలుసిరాజ్‌కు పిలుపు

సిరాజ్‌కు పిలుపు

- Advertisement -

గాయంతో హర్షిత్‌ రాణా అవుట్‌
ముంబయి :
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వేటలో తొలి మ్యాచ్‌కు ముందే భారత్‌కు గాయాల బెడద మొదలైంది. దక్షిణాఫ్రికాతో వార్మప్‌ మ్యాచ్‌లో మోకాలి గాయానికి గురైన హర్షిత్‌ రాణా.. టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. గాయంతో ఒక్క ఓవర్‌ అనంతరం మైదానం వీడిన హర్షిత్‌ రాణా, మళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెట్టలేదు. వైద్య పరీక్షలు, నిపుణులతో సంప్రదింపుల అనంతరం హర్షిత్‌ రాణా ప్రపంచకప్‌లో ఆడలేడనే నిర్థారణకు వచ్చారు. ప్రపంచకప్‌ జట్టు నుంచి హర్షిత్‌ రాణా తప్పుకోగా.. అతడి స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ను ఎంపిక చేశారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టెక్నికల్‌ కమిటీ అనుమతితో సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ప్రధాన పేసర్‌గా, బ్యాట్‌తో హిట్టింగ్‌ చేయగల సత్తా రాణా సొంతం. సిరాజ్‌ చివరగా 2024లో ఓ టీ20 మ్యాచ్‌ ఆడినా.. ఐపీఎల్‌లో 160 మ్యాచ్‌లు ఆడిన విశేష అనుభవం సిరాజ్‌ సొంతం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -