Monday, June 1, 2026
E-PAPER
Homeజాతీయంపారిశ్రామికోత్పత్తి మందగమనం

పారిశ్రామికోత్పత్తి మందగమనం

- Advertisement -

ఏప్రిల్‌‌లో 4.9 శాతానికి పరిమితం
న్యూఢిల్లీ
: దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) మందగించింది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో 4.9 శాతం పెరుగుదలతో సరిపెట్టుకుంది. గతేడాది ఇదే సమయంలో పాత సిరీస్‌ ‌ప్రకారం.. 5.7 శాతం వృద్ధి నమోదయ్యింది. ఈ కొత్త సిరీస్‌లో ఇండెక్స్ పరిధిని పెంచుతూ 120 కొత్త వస్తు విభాగాలను కేంద్ర గణాంకాల శాఖ చేర్చింది. పాత సిరీస్ ప్రకారం మార్చి నెలలో 4.1 శాతంతో ఐదు నెలల కనిష్ట స్థాయిని చవి చూసింది. కాగా.. ఫిబ్రవరిలోనూ 5.1 శాతంగా ఉండగా.. తాజాగా సవరించిన గణాంకాల ప్రకారం మార్చి నెలకు 3.2 శాతంగా, ఫిబ్రవరి నెలకు 5.3 శాతంగా సవరించారు. ఇటీవల ఐఐపి ఆధారిత సంవత్సరాన్ని 2011-12 నుంచి 2022-23కు మార్చారు. ఇందులో డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో కూడిన మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డ్‌లు, సిసిటివి కెమెరాలు, నాన్ వోవెన్ టెక్స్‌టైల్ ఉత్పత్తులు, విమానాలు, అంతరిక్ష నౌకల భాగాలు, స్టెంట్లు, వ్యాక్సిన్‌ల వంటి వస్తువులను చేర్చారు. మైనింగ్ విభాగంలో ప్రధాన ఖనిజాలతో పాటు మైనర్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్‌ను కూడా చేర్చారు. సవరించిన ఈ బాస్కెట్‌లో 463 వస్తు విభాగాల్లో 1,042 ఉత్పత్తులు ఉన్నాయి.ఈ తాజా సిరీస్‌లో మైనింగ్ అండ్‌ క్వారీయింగ్ రంగం 5.1 శాతం క్షీణతను ‌చవి చూసింది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన తయారీ రంగం 6.2 శాతం పెరుగుదలను నమోదు చేసింది. విద్యుత్, గ్యాస్ సరఫరా 4.9 శాతం, వాటర్ సప్లై, సీవరేజ్ అండ్‌ వేస్ట్ మేనేజ్‌మెంట్ 6.6 శాతం చొప్పున ‌పెరిగాయి. ప్రాథమిక వస్తువుల ఉత్పత్తి కేవలం 0.8 శాతానికి పరిమితమైంది.: దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) మందగించింది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో 4.9 శాతం పెరుగుదలతో సరిపెట్టుకుంది. గతేడాది ఇదే సమయంలో పాత సిరీస్‌ ‌ప్రకారం.. 5.7 శాతం వృద్ధి నమోదయ్యింది. ఈ కొత్త సిరీస్‌లో ఇండెక్స్ పరిధిని పెంచుతూ 120 కొత్త వస్తు విభాగాలను కేంద్ర గణాంకాల శాఖ చేర్చింది.

పాత సిరీస్ ప్రకారం మార్చి నెలలో 4.1 శాతంతో ఐదు నెలల కనిష్ట స్థాయిని చవి చూసింది. కాగా.. ఫిబ్రవరిలోనూ 5.1 శాతంగా ఉండగా.. తాజాగా సవరించిన గణాంకాల ప్రకారం మార్చి నెలకు 3.2 శాతంగా, ఫిబ్రవరి నెలకు 5.3 శాతంగా సవరించారు. ఇటీవల ఐఐపి ఆధారిత సంవత్సరాన్ని 2011-12 నుంచి 2022-23కు మార్చారు. ఇందులో డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో కూడిన మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డ్‌లు, సిసిటివి కెమెరాలు, నాన్ వోవెన్ టెక్స్‌టైల్ ఉత్పత్తులు, విమానాలు, అంతరిక్ష నౌకల భాగాలు, స్టెంట్లు, వ్యాక్సిన్‌ల వంటి వస్తువులను చేర్చారు. మైనింగ్ విభాగంలో ప్రధాన ఖనిజాలతో పాటు మైనర్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్‌ను కూడా చేర్చారు. సవరించిన ఈ బాస్కెట్‌లో 463 వస్తు విభాగాల్లో 1,042 ఉత్పత్తులు ఉన్నాయి. ఈ తాజా సిరీస్‌లో మైనింగ్ అండ్‌ క్వారీయింగ్ రంగం 5.1 శాతం క్షీణతను ‌చవి చూసింది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన తయారీ రంగం 6.2 శాతం పెరుగుదలను నమోదు చేసింది. విద్యుత్, గ్యాస్ సరఫరా 4.9 శాతం, వాటర్ సప్లై, సీవరేజ్ అండ్‌ వేస్ట్ మేనేజ్‌మెంట్ 6.6 శాతం చొప్పున ‌పెరిగాయి. ప్రాథమిక వస్తువుల ఉత్పత్తి కేవలం 0.8 శాతానికి పరిమితమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -