Tuesday, June 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకీవ్‌పై రష్యా భీకర దాడి.. 9 మంది మృతి

కీవ్‌పై రష్యా భీకర దాడి.. 9 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌తో పాటు ప‌లు న‌గ‌రాల‌పై ర‌ష్యా మిస్సైళ్లు, డ్రోన్ల‌తో దాడి చేసింది. ఈ దాడుల్లో సుమారు 9 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు, 29 మంది గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. కీవ్‌లో రెసిడెన్షియ‌ల్ బిల్డింగ్‌లు, రెండు బ‌హుళ అంత‌స్థుల భ‌వ‌నాలు దెబ్బ‌తిన్నాయి. దిన్ప్రోలో అయిదుగురు, కీవ్‌లో న‌లుగురు మృతిచెందారు. తెల్ల‌వారుజాము వ‌ర‌కు దాడులు కొన‌సాగాయి. ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించిన 24 గంట‌ల్లోనే ఈ దాడి జ‌రిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -