Saturday, June 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మక్తల్‌లో పెట్రోల్, డీజిల్ కొరత

మక్తల్‌లో పెట్రోల్, డీజిల్ కొరత

- Advertisement -

ప్రజలు, రైతులకు తీవ్ర ఇబ్బందులు
నవతెలంగాణ-మక్తల్
మక్తల్ పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా నెలకొనడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం ఉదయం వర్షం కురవడంతో వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు ట్రాక్టర్లకు డీజిల్ తీసుకెళ్లేందుకు వచ్చిన రైతులు పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణంలోని ఐదు పెట్రోల్ బంకుల్లో ఒక బంకు గత 20 రోజులుగా మూతపడగా.. మిగిలిన బంకుల్లో కూడా పూర్తిస్థాయిలో ఇంధనం అందుబాటులో లేకపోవడం సమస్యను మరింత తీవ్రమైంది. పట్టణ కేంద్రంలో ఒక బంకులో పెట్రోల్ మాత్రమే ఉండగా, మరో బంకులో డీజిల్ మాత్రమే లభించే పరిస్థితి నెలకొంది.

దీంతో వాహనదారులు, రైతులు ఒక బంకు నుంచి మరో బంకుకు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఇంధన కొరత కారణంగా కొందరు కర్ణాటక ప్రాంతం నుంచి పెట్రోల్ తీసుకొచ్చి బంకుల బయట అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, స్థానికంగా ఇంధనం దొరకకపోవడంతో ప్రజలు సమీప ప్రాంతాలకు వెళ్లి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అదేవిధంగా ఒక బంకులో ఇంధన సరఫరా ప్రారంభం కావడంతో భారీ సంఖ్యలో వాహనదారులు అక్కడికి చేరుకుని క్యూలైన్ లో పెద్ద డబ్బాలు, క్యాన్ లు పెట్టి వేచి చూస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్న సమయంలో డీజిల్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు, మోటార్లు నడిపేందుకు అవసరమైన డీజిల్ అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గోవిందరాజు మాట్లాడుతూ..వ్యవసాయ సీజన్ ప్రారంభమైన వేళ మక్తల్‌లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడటం ఆందోళనకరమన్నారు. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనులు చేపట్టేందుకు ఇంధనం అత్యవసరమన్నారు. ప్రభుత్వం, ఆయిల్ కంపెనీల అధికారులు వెంటనే స్పందించి మక్తల్‌లో ఇంధన కొరతను నివారించి రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంధన కొరతకు గల కారణాలపై సంబంధిత అధికారులు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఇంధన సరఫరాను సక్రమంగా నిర్వహించాలని ప్రజలు, రైతులు అధికారులను కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -