Tuesday, June 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే తోట

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన మండల కేంద్రంలోని ఆడిటోరియంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ భవనాన్ని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావడానికి తగిన చర్యలు చేపడతామని తెలిపారు.

అనంతరం ఉపాధి హామీ కార్మికుల కార్యక్రమంలో పాల్గొని, ఉపాధి హామీ పథకం ప్రారంభమై 20 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. గ్రామీణ పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులను తగ్గించి, గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా లక్షలాది కుటుంబాల జీవనోపాధి మెరుగుపడిందని తెలిపారు. ఉపాధి హామీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. 

అలాగే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తూ, పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని తెలిపారు. కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తో పాటు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -