నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూకి అమెరికా అధ్యక్షుడు మెట్టెకాయలు వేశారు.ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
‘నువ్వు పిచ్చివాడివి. నేను లేకపోతే నువ్వు జైలులో ఉండేవాడివి. నేను నిన్ను కాపాడుతున్నా. ప్రస్తుతం అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు. నీ చర్యల వల్ల ఇజ్రాయెల్‌పై కూడా వ్యతిరేకత పెరుగుతోంది. అసలు నువ్వు ఏం చేస్తున్నావు’ అని నెతన్యాహుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి. హెజ్‌బొల్లాకు చెందిన ఓ సైనిక కమాండర్‌ను హతమార్చేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో అమాయకులైన లెబనీస్ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది .
కాగా,లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులను నిరసిస్తూ ఇరాన్ ప్రభుత్వం శాంతిచర్చలకు విముఖత వ్యక్తం చేసింది. లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు ఆపే వరకు అమెరికాతో ఎలాంటి చర్చలు జరపమని స్పష్టం చేసింది. దీంతో నెతన్యాహుతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. తాజా వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించాయి.



