Tuesday, June 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ పరిధిలోని రామారావు పల్లె,ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యతను, విద్యార్థులకు తెలియజేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ తెలిపారు.ప్రతి ఒక్క వ్యక్తి పోరాట పటిమతోటే తెలంగాణ సాధించుకోవడం అనేది జరిగిందని,ఇందులో ఎంతోమంది  విద్యార్థుల బలిదానాల వల్ల తెలంగాణ ఏర్పడడం అనేది జరిగిందని,తెలంగాణ ఏర్పాటులో ప్రతి ఒక్క పౌరుడు అహర్నిశలు కష్టపడి తెలంగాణ సాధించుకోవడం అనేది జరిగిందన్నారు.నిధులు నియామకాల కోసమే తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగిందని,ఇందులో ప్రతి ఒక్క ఉద్యోగస్తులు, జర్నలిస్టులు,లాయర్లు,ప్రొఫెసర్లు,అధ్యాపకులు, డాక్టర్లు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క అడుగు జాడల్లో నడిచి వారి యొక్క ఆశయాలను ముందుకు సాగించడం తెలంగాణ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -