నవతెలంగాణ-నవాబు పేట
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ సురేష్ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ హరలింగం ముదిరాజ్,ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జయరాం నాయక్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గీతారాణి, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణ్ కుమార్, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ కృష్ణ జీ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ,ఎంఆర్సీ కార్యాలయంలో ఎంఈఓ నాగ్య నాయక్ , ఐకేపీ కార్యాలయంలో మహిళా సంఘం అధ్యక్షురాలు, కస్తూరిబా గాంధీ పాఠశాలలో ప్రిన్సిపాల్ మాధవి, వివిధ గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాలలోని ఆయా గ్రామాల సర్పంచ్ లు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధాన ఉపాధ్యాయులు అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
తెలంగాణ గీతం ఆలాపన చేసి,జాతీయ గీతాలాపన చేసి జండా వందన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు ఎందరో మహానుభావులు అమరులైన వారికి నివాళులు అర్పించారు.తెలంగాణ తల్లి విగ్రహానికి,ప్రోఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.తెలంగాణ అభివృద్ధికి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు బంగ్ల రవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తులసీ రాం నాయక్ డిప్యూటీ తహశీల్దార్ సువర్ణ,ఆరై రామాంజనేయులు, గాయత్రి, సీనియర్ అసిస్టెంట్ నారాయణ,జ్యోతి, సూపరింటెండెంట్ , ఏపీఎం శ్రీహరి మార్కెట్ కార్యదర్శి రమేష్ . పంచాయతీ కార్యదర్శి నరేష్,ఉపసర్పంచ్ హజహర్ అలీ సుధాకర్ చారి, పుట్టి అంజయ్య,మెండె శ్రీనివాస్ నీలకంఠ బంక వెంకటయ్య,కొల్లి నర్సింహులు చిర్ప సత్యం ఆనంద్, రాము, ఆయా గ్రామాల జీపీఓ లు జూనియర్ అసిస్టెంట్ మణికంఠ, సిబ్బంది గోపాల్ సత్యం రాజు రూప ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.



