తెలంగాణ ప్రగతి శిలా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఆర్, రమేష్ పిలుపు
నవతెలంగాణ – దర్పల్లి
మండల కేంద్రంలో శనివారం టీయుసిఐ ఆధ్వర్యంలో దేశ వ్యాప్త సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు. ఈనెల 12వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మెలో సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రగతి శిల గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఆర్, రమేష్ పిలుపునిచ్చారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ.. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు ,కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, పరిశ్రమంలో పనిచేస్తున్న కార్మికులు కోట్లాదిమంది పాల్గొని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేయనున్నారు.
కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని ప్రతి ఉద్యోగి వర్కర్ కి పిఎఫ్ ఈఎస్ఐ గ్రాడ్యుటి చట్టాలు అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటంతో కేంద్ర ప్రభుత్వం మొండి తనాని విడినాడి ప్రజల కోసం కార్మికుల కోసం పనిచేయాలని లేనియెడల భవిష్యత్తులో తీవ్రమైన పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఫిబ్రవరి 12వ తేదీ జరిగే సమ్మెలో బీడీ కార్మికులు,భవన నిర్మాణ కార్మికులు, పంచాయతీ వర్కర్స్ ,మిషన్ భగీరథ, ఆశ, అంగన్వాడీలు హమాలీలు, విద్యుత్తు, హాస్పటల్, బ్యాంకు ,పోస్ట్ ఆఫీస్, రైల్వే వివిధ ఉద్యోగులు అందరు కూడా అధిక సంఖ్యలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమం లో టీయుసిఐ జిల్లా నాయకులు, ఆశన్న, మండల నాయకులు,సాయిలు, వీలాష్, సులోచన, సాయవ్వ, సాయవ్వ తదితరులు పాల్గొన్నారు.



