వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడు. వడ్డే నవీన్, రాశి సింగ్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈనెల 19న గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. డైరెక్టర్ కమల్ తేజనార్లతో వడ్డే నవీన్‌కథ, స్క్రీన్ ప్లేలో భాగం కావటం విశేషం. రీసెంట్‌గా విడుదలైన టీజర్, టా టా అనే సాంగ్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. టా టా సాంగ్ బ్లాక్ బస్టర్ తర్వాత మేకర్స్ ఈ సినిమా నుంచి ‘నువ్వే కదా..’ అనే మరో సాంగ్‌ను ఎఫ్ ఎం రేడియో స్టేషన్‌లో విడుదల చేశారు.
కళ్యాణ్ నాయక్ సంగీత సారథ్యం వహిస్తోన్న సినిమాలోని ఈ పాటను భాస్కరభట్ల రాయగా.. పివిఎన్ఎస్ రోహిత్, హరిణి ఇవటూరి పాడారు. దినేష్ కుమార్ కొరియోగ్రఫీ అందించారు. హీరో హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ, అనురాగం, అనుబంధాలను తెలియజేసేలా ఈ పాట ఉంది.
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -



