Tuesday, June 2, 2026
E-PAPER
Homeసినిమాఆద్యంతం నవ్వించే సినిమా

ఆద్యంతం నవ్వించే సినిమా

- Advertisement -


శ్రీహరి హీరోగా నటిస్తున్న సినిమా ‘పెళ్ళైంది కాని నో కహాని. స్మిత హీరోయిన్. ఈ మూవీని మై3 సినిమాస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఏడు కొండలు తాడిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం ఈ చిత్ర పోస్టర్ ను హీరో రాజ్ తరుణ్ లాంచ్ చేశారు. హీరో శ్రీహరి మాట్లాడుతూ,'హీరో రాజ్ తరుణ్, ఐఎఫ్ఎక్స్ అధినేత పద్మనాభరెడ్డికి కృతజ్ఞతలు. మా సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా ఆద్యంతం హిలేరియస్గా ఎంటర్ టైన్ చేస్తుంది. డైరెక్టర్ ఏడుకొండలు చాలా బాగా రూపొందించారు అని తెలిపారు.
‘పోస్టర్ చాలా ఆసక్తిగా అనిపి స్తోంది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను దర్శకుడు ఏడుకొండలు తెరకెక్కిం చారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలని కోరుకుం టున్నాఅని హీరో రాజ్ తరుణ్ చెప్పారు. ఐఎఫ్ఎక్స్ అధినేత పద్మనాభరెడ్డి మాట్లాడుతూ,'అందరినీ అలరించే సినిమా ఇది అని తెలిపారు.
‘షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. రెండు మూడు రోజుల్లో సెన్సార్ పూర్తవుతుంది. వచ్చే నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం` అని డైరెక్టర్ ఏడుకొండలు తాడిశెట్టి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -