Tuesday, June 2, 2026
E-PAPER
Homeసినిమా'పెద్ది` మీ గుండెల్లో నిలిచిపోతాడు

‘పెద్ది` మీ గుండెల్లో నిలిచిపోతాడు

- Advertisement -

‘ఎన్టీఆర్ కోసం అనుకున్న కథ వేరు. ‘పెద్దికథ వేరు. ఇది పూర్తిగా రామ్ చరణ్ కోసం తయారు చేసిన కథ అని దర్శకుడు బుచ్చిబాబు సానా చెప్పారు.
రామ్ చరణ్ నటించిన యాక్షన్ డ్రామా సినిమా ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఈ సినిమా ఈనెల 4న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో డైరెక్టర్ బుచ్చిబాబు సానా మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ వీళ్లందరూ ఆ పాత్రలకు పర్ఫెక్ట్‌గా సరిపోతారు. శివన్న ఒక గురువుగా కనిపిస్తారు. ఆటను బతికించేవాడి పాత్ర అది. అలాగే జగపతిబాబు అప్పలసూరి పాత్ర చాలా బరువైనది. హీరో తర్వాత అంత పవర్‌ఫుల్‌గా ఉండే పాత్ర అది. దివ్యేందు పాత్ర కూడా చాలా క్రేజీగా ఉంటుంది.
జాన్వి కపూర్ ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన కలర్ తీసుకొచ్చారు. లవ్ ట్రాక్‌లో చాలా బాగుంటారు.
నాకు రోజా, బొంబాయి.. రెహమాన్ ఆల్బమ్స్ చాలా ఇష్టం. ఆయనతో పనిచేయాలని ఎప్పటి నుంచో కల కన్నాను. ఈ సినిమా ద్వారా ఆ అవకాశం వచ్చింది. ఆయన పాటలను స్వయంగా పాడు తుంటే వింటూ చాలా ఎంజాయ్ చేశాను. ఆయనతో సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయాను.
పుష్పరాజ్ మైండ్‌లో ఉంటే… పెద్ది గుండెల్లో ఉంటాడు. రామ్ చరణ్ నా గురించి మాట్లాడుతూ ఇండియాలో టాప్-5 డైరెక్టర్లలో నేను ఉంటానని చెప్పడం, ఆయనకు నాపై ఉన్న అభిమానం.
‘పెద్ది` జర్నీని మూడు దశలుగా విభజించాం. ప్రతి దశకు లుక్ ఎలా ఉండాలో ఏఐలో డిజైన్ చేసి, ఆయన దగ్గరకు తీసుకెళ్లాను. నేను డిజైన్ చేసిన దానికంటే ఇంక్భు తంగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ మైండ్‌ బ్లోయింగ్‌గా అనిపించింది.
క్లైమాక్స్ ఎలా ఉంటుందో మీరు బిగ్ స్క్రీన్‌పై అనుభవించాలి. ఇప్పటి వరకు చూసినవాళ్లంతా ఎక్స్‌ట్రార్డి నరీగా ఉందని చెప్పారు.
ఫైనల్ కాపీ చూసుకున్నాక మంచి సినిమా తీశాననే ఫీలింగ్ కలిగింది. మా గురువు సుకుమార్ సెకండాఫ్ తన ఫేవరెట్ అని చెప్పారు. చిరం జీవి ఇంకా చూడలే దు. సురేఖ ఒక సీక్వెన్స్ చూశారు. ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు.
పెద్ది గురించి ఒక మాటలో చెప్పా లంటే ఫ్యామిలీతో కలిసి వెళ్లి హ్యాపీగా చూడండి. సూపర్‌గా ఉం టుంది. చాలా ఎమోషనల్‌గా ఉం టుంది. కమర్షియల్‌గా ఉంటుంది. ఇందులో చరణ్ గారు కనిపిం చరు… పెద్ది మాత్రమే కనిపిస్తాడు. పెద్ది ఆట నుంచి ఏం నేర్చు కున్నాడు, ఆ ఆట అతనికి ఏమిచ్చిం ది అనేది ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -