Wednesday, June 3, 2026
E-PAPER
Homeజిల్లాలుజొన్నలు కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

జొన్నలు కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ-రాజోలి: రాజోలి మండలం పచర్ల గ్రామంలో బుధవారం రోజు అల్లంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు జొన్నలు కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రైతులు ఎవరు కూడా దళారుల చేతుల్లో మోస‌పోవ‌ద్దు, అన్న‌దాత‌ల సాగు ప్ర‌భుత్వమే కొనుగోలు చేస్తుంద‌ని హామీ ఇచ్చారు. పంట‌ల కొనుగోలు సంద‌ర్భంగా ప్రతి ఒక్క రైతు అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను సంబంధిత వ్యవసాయ అధికారులకు ఇవ్వాలని సూచించారు. పంట‌ల కొనుగోలు త‌ర్వాత న‌గ‌దు చెల్లింపు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని ఎమ్మెల్యే తెలియ‌జేశారు. ఈ కార్యక్రమంలో రాజోలి ఎస్సై గోకరి, బిఆర్ఎస్ నాయకులు, సర్పంచ్ బేబీ సునీల్, బిఆర్ఎస్ పార్టీ రాజోలి మండల అధ్యక్షుడు పచ్చర్ల శ్రీనివాసులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -