Wednesday, June 3, 2026
E-PAPER
Homeజిల్లాలుఉమామహేశ్వరం అభివృద్ధికి కృషి

ఉమామహేశ్వరం అభివృద్ధికి కృషి

- Advertisement -

కోటి రూ.30 లక్షల తో రోడ్డు పనులకు శంకుస్థాపన 
భక్తులకు ఉచిత దర్శనం సౌకర్యం: ఎమ్మెల్యే వంశీకృష్ణ 
నవతెలంగాణ-అచ్చంపేట
మండల పరిధిలోని వెలిసిన శ్రీశైలం ఉత్తర ద్వారంగా పేరుగాంచిన ఉమామహేశ్వర దేవస్థానం అభివృద్ధికి అలుపెరుగని కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో నూతన దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఆలయ కమిటీ వారు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ భక్తిశ్రద్ధలతో ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను తొలగిస్తామని, వివిధ ప్రాంతాల నుంచి ఉమామహేశ్వరం వస్తున్న భక్తులకు పూర్తిగా ఉచిత దైవదర్శనం కల్పిస్తున్నామని తెలిపారు.

రూ. 1 కోటి 30 లక్షలతో కొండ కింది నుంచి పై వరకు సిసి రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఉమామహేశ్వరంలో త్వరలోనే మహా యజ్ఞం 108 మంది అయ్యగార్లతో కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు. నవ లింగాల గుడి అభివృద్ధికి, ఆంజనేయస్వామి గుడి అభివృద్ధికి రూ.50 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని అన్నారు. శివపార్వతుల ప్రతిమ ఏర్పాటు చేసి రోప్ కార్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కొండ కింద సామూహిక వివాహాలు నిర్వహించుకునేందుకు కళ్యాణ మండపం నిర్మాణం చేస్తామన్నారు. ప్రస్తుతం రోజువారీగా భక్తులకు మధ్యాహ్న ఉచితంగా మధ్యాహ్న భోజనం అమలు చేయడం జరుగుతుంది. ఉమామహేశ్వరం వచ్చిన భక్తులు స్నానాలు భక్తిశ్రద్ధలతో చేసేందుకు కోనేరును మరమ్మత్తులు చేసి వినియోగం లోకి తీసుకురావడం జరుగుతుందన్నారు.

కాకతీయుల కాలం నాటి నల్లమల్లలో వెలిసిన ప్రతాపరుద్రుని కోట అభివృద్ధి పరుస్తామన్నారు. నల్లమల్లలో ప్రకృతి అందాలు దేవాలయాల దర్శనం తిలకించడానికి లండన్ ఐ మాదిరిగా నల్లమల్ల “ఐ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయం రూ.15 కోట్లతో హరిత హోటల్ నిర్మాణం చేయడానికి త్వరలోనే టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అటవీ శాఖ ఉన్నత అధికారులు మంత్రులతో అనుమతి తీసుకొని వారి సహకారంతో నల్లమల్ల ప్రాంతాల్లోని దేవాలయాల అభివృద్ధికి చేస్తానన్నారు. నూతన చైర్మన్ మాధవరెడ్డి కమిటీ సభ్యులు, ఈవో శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -