Wednesday, June 3, 2026
E-PAPER
Homeజాతీయంటిఎంసి పార్టీలో చీలిక…58 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు

టిఎంసి పార్టీలో చీలిక…58 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మమతాబెనర్జీకి భారీ షాక్‌ ‌తగిలింది. టిఎంసి పార్టీలో చీలిక వచ్చింది. 58 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీపై తిరుగుబాటు చేశారు. టిఎంసి నిర్ణయాన్ని ఖాతరు చేయకుండా తిరుగుబాటు ఎమ్మెల్యేల తరపున అసెంబ్లీ ప్రతిపక్షనేతగా రితబ్రతా బెనర్జీని గుర్తించాలని అసెంబ్లీ స్పీకర్‌ ‌రతీంద్ర బోస్‌‌కు విజ్ఞప్తి చేశారు.

ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలందరికీ పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన రితబ్రతా నాయకత్వం వహిస్తున్నారు. వీరందరినీ ఆయనే ప్రత్యేక బస్సులో అసెంబ్లీ వద్దకు తీసుకెళ్లి స్పీకర్‌‌కు లేఖ కూడా సమర్పించారు. ఎమ్మెల్యేల మద్దతు ప్రకారం రితబ్రతానే అసెంబ్లీ ప్రతిపక్షనేతగా స్పీకర్‌ ‌ప్రకటిస్తే.. అసెంబ్లీలో టిఎంసికి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు.

కాగా, టిఎంసి శోభన్‌‌దేవ్‌ ‌ఛట్టోపాధ్యాయను ప్రతిపక్షనేతగా ఎన్నుకోవడానికి మద్దతు ఇచ్చింది. అయితే టిఎంసి పార్టీలోని ఎమ్మెల్యేలు శోభన్‌‌దేవ్‌‌ని కాకుండా రితబ్రతను ప్రతిపక్షనేతగా మద్దతు ఇచ్చారు. దీంతో పశ్చిమబెంగాల్‌‌లో కొత్తగా ఈ పరిణామం ముందుకొచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -