Thursday, June 4, 2026
E-PAPER
Homeజాతీయంసీబీఎస్ఈ రీవాల్యుయేషన్‌..పొటెత్తిన దరఖాస్తులు

సీబీఎస్ఈ రీవాల్యుయేషన్‌..పొటెత్తిన దరఖాస్తులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సీబీఎస్ఈ 12వ తరగతి జవాబు పత్రాల రీవాల్యుయేషన్‌, వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 44వేల దరఖాస్తులు వచ్చాయని సీబీఎస్ఈ బుధవారం వెల్లడించింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి జవాబు పత్రాల పరిశీలన కోసం 4,924, పునఃమూల్యాంకనం కోసం 39,056 దరఖాస్తులు స్వీకరించినట్టు సీబీఎస్ఈ ఎక్స్‌లో పోస్టు చేసింది. జవాబుపత్రాల పరిశీలన, పునఃమూల్యాంకనం కోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా మొత్తం 43,980 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. జవాబు పత్రాల మూల్యాంకనం కోసం కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ స‌ర్కీన్ మార్కింగ్‌ విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన నేపథ్యంలో.. సీబీఎ్‌సఈ రీవాల్యుయేషన్‌, వెరిఫికేషన్‌ కోసం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -