- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పూణెకు చెందిన ఐటీ సంస్థ ‘థింక్‌టెక్ ఇండియా’ తన కార్యకలాపాలను అకస్మాత్తుగా నిలిపివేసింది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న 700 మందికి పైగా ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. ఆఫీసులకు తాళాలు వేసి ఉండటం, కంపెనీ ప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు రావలసిన బకాయి జీతాలు, సెక్యూరిటీ డిపాజిట్లు ఇప్పించాలంటూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఈ పరిణామంపై పోలీసులు రంగంలోకి దిగారు. ఆర్థిక అక్రమాలు, మోసాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా కంపెనీ సీఈఓ హర్షల్ ఠాక్రేను పోలీసులు అరెస్ట్ చేశారు.
- Advertisement -



