
నవతెలంగాణ- కమ్మర్ పల్లి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ అందిస్తున్న జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు, యువకులు ఇతర పార్టీ కార్యకర్తలు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బుధవారం బీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన వారిలో కమ్మర్ పల్లి మండలం కొనసముందర్ గ్రామానికి చెందిన వంజరి సంఘం యూత్ సభ్యులు, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామం నుండి అశోక్ రెడ్డి, మనోహర్ రెడ్డి అద్వర్యంతో యంగ్ బాయ్స్ యూత్ నుండి రాజేందర్, యూత్ సభ్యులు, రమేష్ ఆధ్వర్యంలో 20 మంది యువకులు పార్టీలో చేరారు. వెల్కటూర్ గ్రామం నుండి రెడ్డీస్ యూత్ యువజన సభ్యులు, భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామం నుండి పాలేపు గంగా చరణ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన అయిత భాస్కర్, పాలేపు రాజ్ కుమార్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.