Thursday, June 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి 

ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి 

- Advertisement -

నవతెలంగాణ-మోర్తాడ్ 
మండలంలోని గ్రామాలలో ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని పాఠశాల ఉపాధ్యాయులు గ్రామాలలో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. మండలం ధర్మోరా గ్రామంలో ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం సర్పంచ్ మానస లక్ష్మణ్ ఆధ్వర్యంలో గ్రామంలోని పిల్లల తల్లిదండ్రుల వద్దకు వెళ్తూ అవగాహన నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపటు ఉత్తీర్ణత గల ఉపాధ్యాయుల సమక్షంలో విద్యాభ్యాసాలు కొనసాగుతాయని ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించేలా కృషి చేయాలని కోరారు. 12 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -