Saturday, June 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి: ఎంపీడీఓ

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి: ఎంపీడీఓ

- Advertisement -

 నవతెలంగాణ-చిన్నకోడూరు 
ప్రభుత్వ పథకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని, బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి వాటిని బలోపేతం చేయాలని ఎంపీడీవో జనార్ధన్ పిలుపునిచ్చారు.గురువారం రామంచ గ్రామంలో సర్పంచ్ భవాని  అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ  వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్తబండికి ఇవ్వాలని కోరారు.రసాయన ఎరువులు తగ్గించి, సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలన్నారు. 

అనంతరం ప్రధానోపాధ్యాయులు వై.వి.సురేష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామంలో ‘బడిబాట’ కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపుతున్న తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పావని తిరుపతిరెడ్డి, వార్డు సభ్యులు కనకయ్య, రాజు, పంచాయతీ కార్యదర్శి శేఖరానంద చారి, ప్రేమలత, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -