ప్రజా పోరాటాల్లోనే కమ్యూనిస్టుల బలం
సోషలిస్టు వ్యవస్థ ద్వారానే ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పి సోమయ్య
నవతెలంగాణ – ఖమ్మం
సమాజంలో ప్రజల కోసం త్యాగాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టులదేనని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పి సోమయ్య అన్నారు. కమ్యూనిస్టుల విశిష్టత అనే అంశంపై క్లాస్ బోధిస్తూ ఆయన మాట్లాడారు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా అమెరికాలో సాగిన కార్మిక పోరాటం నుండి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వరకు కమ్యూనిస్టులు ప్రజల కోసం అసమానమైన త్యాగాలు చేశారని ప్రజల కోసం త్యాగాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టులదేనని అన్నారు. బ్రిటి సామ్రాజవాదానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కోసం కమ్యూనిస్టులు జాతీయోద్యమంలో భాగంగా ఏళ్లకు ఏళ్లు జైలు జీవితం గడిపారని తెలిపారు. దున్నేవాడికే భూమి కావాలని మట్టి మనుషుల చేత బంధువులు పట్టించి నైజాం నవాబులను తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టులదేనని గుర్తు చేశారు. పది లక్షల ఎకరాల భూ పంపిణీ మూడువేల గ్రామ స్వరాజ్యాలు కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏర్పాటు అయ్యాయని తెలిపారు.
సీపీఐ(ఎం) నాయకత్వంలో పనిచేసిన వామపక్ష ప్రభుత్వం కేరళని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దని ఇది కమ్యూనిస్టు పార్టీకి ప్రజల పట్ల ఉన్న నిబద్ధతని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల్లో ఓట్లు సీట్లు ఆధారంగా కమ్యూనిస్టు పార్టీల బలం తగ్గిందని కొద్ది మంది కమ్యూనిస్టు వ్యతిరేకులు సంబరపడుతున్నారని కానీ ఇది శాశ్వతం కాదని తెలిపారు. కమ్యూనిస్టుల బలం ఓట్లు సీట్లలో లేదని ప్రజా పోరాటాల్లో కమ్యూనిస్టుల బలం ఉందని తెలిపారు. గెలిచినా ఓడిన ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలపై నికరంగా రాజీలేని పోరాటాలు చేసే చరిత్ర కమ్యూనిస్టు పార్టీదని ప్రజల నుండి కమ్యూనిస్టు పార్టీని వేరు చేయడం ఎవరి తరం కాదని తెలిపారు. పేదరికం దరిద్రం సామాజిక అసమానతలు ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందని కమ్యూనిస్టు పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, కొక్కెరపాటి పుల్లయ్య, ఎం బి నర్సారెడ్డి, కే బ్రహ్మచారి, లిక్కి బాలరాజు, రేపాకుల శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు కున్సోత్, ధర్మ దొడ్డ రవి, ఎస్ఏ నబి, చిరంజీవి, నాయుడు, పిట్టల అర్జున్, మోరంపూడి శ్రీనివాస్, ముదిగొండ రాంబాబు, కొండబోయిన వెంకటేశ్వర్లు, వీర్ల రమేష్, గడ్డం స్వామి, యాసా నరేష్, భూక్య రమేష్, వాంకుడోత్ కోబాల్, సోడే ప్రసాద్, గద్దల శ్రీను, నిమ్మల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.



