నవతెలంగాణ – హైదరాబాద్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా విడుదలైన రెండో రోజే పైరసీ బారినపడడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల వర్షం కురిపిస్తుండగా.. మరోవైపు పైరసీ భూతం చిత్ర నిర్మాతలను వెంటాడుతోంది.
ఈ నేపథ్యంలో మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా పైరసీ లింకులను వెంటనే తొలగించాలని, ఈ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరుతున్నారు. ఈ పైరసీ గండాన్ని దాటుకుని ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందో లేక పైరసీకి “పెద్ది”బలవుతుందో వేచి చూడాల్సిందే.!



