- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ కు చెందిన రాడార్ కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. హోర్ముజ్ జలసంధి వైపు ప్రయాణిస్తున్న నాలుగు ఇరాన్ డ్రోన్లు సముద్ర రవాణాకు ముప్పుగా మారే అవకాశం ఉండటంతో వాటిని గాల్లోనే ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఇరాన్ కూడా ప్రతిదాడుకుల దిగింది. గల్ప్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది.కువైట్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.
- Advertisement -



