Saturday, June 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి జి. కళార్చన
నవతెలంగాణ-వనపర్తి 

20న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి జి. కళార్చన పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లాలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ తో ప్రత్యేక సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టు లలో పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, మెయింటెనెన్స్ కేసులు, గృహహింస చట్టం క్రింద నమోదైన కేసులు, ప్రమాద భీమా క్లెయిమ్ కేసులు, సివిల్ కేసుల పరిష్కారం కోసం జాతీయ లోక్అదాలత్ ను ఈ నెల 20 నిర్వహించనున్నట్లు తెలిపారు. కావున కక్షిదారులు ఈ జాతీయ లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి. కళార్చన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కార్తీక్ రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్.అశ్విని, డి.ఎస్.పి గిరిబాబు, జిల్లాలోని సర్కిల్ ఇన్స్పెక్టర్స్, జిల్లాలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్స్, కోర్టు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -