నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో గత నెల రోజులుగా జరుగుతున్న బాడ్మింటన్ వేసవి శిక్షణ శిబిరం శనివారం విజయవంతంగా ముగిసింది. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఫిజికల్ డైరెక్టర్ జంగపల్లి వెంకటనర్సయ్య మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక దృఢత్వానికి ఉపయోగపడతాయని, వేసవి శిక్షణ శిబిరాల నుండే ఎంతో మంది జాతీయ క్రీడాకారులు తయారు అయ్యారని తెలిపారు. క్రీడాకారులు అందరూ బాడ్మింటన్ ను ఇలాగే కొనసాగించి హుస్నాబాద్ ప్రాంతానికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరు తీసుకురావాలని కోరారు. అలాగే శిక్షణ శిబిరం ముగింపు టోర్నమెంట్ కి బహుమతులు స్పాన్సర్ చేసిన సీనియర్ క్రీడాకారుడు అఖిల్ ను ప్రత్యేకంగా అభినందించారు. టోర్నమెంట్ లో గెలుపొందిన క్రీడాకారులు బాలికల సింగిల్ విభాగం లో మొదటి స్థానం నిలిచిన స్ఫూర్తి, రెండవ స్థానం భవిగ్న, బాలుర సింగిల్ విభాగంలో మొదటి స్థానం నితీష్, రెండవ స్థానం అభిరామ్, బాలుర డబుల్ విభాగం లో మొదటి స్థానం లో నిలిచిన జంట నితీష్, అభిరామ్ రెండవ స్థానంలో నిలిచిన సాయి ప్రణీత్, రుషికేశ్ లకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమం లో కోచ్ దిలీప్ సింగ్, బాడ్మింటన్ సీనియర్ క్రీడాకారుడు గంగిశెట్టి అఖిల్ పాల్గొన్నారు.
ముగిసిన బాడ్మింటన్ వేసవి శిక్షణా శిబిరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



