- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో బుధవారం జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల సాధారణ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ రోజును ‘పెయిడ్ హాలిడే’గా ప్రకటిస్తూ కార్మిక శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలవు ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని అన్ని ఫ్యాక్టరీలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక సంస్థలలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులందరికీ వర్తిస్తుంది.
- Advertisement -



