Tuesday, February 10, 2026
E-PAPER
Homeజిల్లాలుసమ్మెను జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ 

సమ్మెను జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
కేంద్ర బిజెపి విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం మండల కేంద్రంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చిన కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతూ కార్మిక వర్గాల పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని,ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని తెలిపారు.

కేంద్ర బిజెపి ప్రభుత్వం ఏకపక్షంగా అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరిగే దేశవ్యాప్త సమ్మెకు కార్మికులు,కర్షకులు,మహిళలు,మేధావులు,సబండ వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నక్క నరసింహ,రామావత్ రాజు నాయక్,ఊరుపక్క లింగయ్య,పగిళ్ల రామచంద్రం,పోలేపల్లి రాములు,సిలువేరు మహేష్,మైలారం నరసింహ,సిల్వర్ వెంకటయ్య,బడే లక్ష్మీకాంత్,ఆవుల ముత్తయ్య,ఎడ్ల జంగయ్య,ఊరి పక్క అరవిందు,బొల్లెపల్లి మల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -