Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దారి మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం తొలగింపు

దారి మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం తొలగింపు

- Advertisement -

– హర్షం వ్యక్తం చేసిన వార్డు సభ్యులు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని ఆరవ వార్డులో దారి మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని మంగళవారం స్థానిక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తొలగింపజేశారు. విద్యుత్ స్తంభం దారి మధ్యలో ఉండడం మూలంగా గత కొన్ని సంవత్సరాలుగా కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దారి మధ్యలో ఉన్న ఈ విద్యుత్ స్తంభం మూలంగా ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాలనీ ప్రజలకు ఇబ్బందిగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించాలని సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, పాలకవర్గ సభ్యులకు కాలనీవాసులు ఇటీవల విన్నవించారు.

వెంటనే స్పందించిన సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ ఈ విషయమై ట్రాన్స్కో ఏఈ అన్నయ్య దృష్టికి తీసుకువెళ్లారు.దీంతో మంగళవారం ఉదయం విద్యుత్ శాఖ సిబ్బంది దారి మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించి, రోడ్డు పక్కన నూతన విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. విద్యుత్ స్తంభం తొలగింపు, నూతన విద్యుత్ స్తంభం ఏర్పాటు కార్యక్రమాన్ని సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్, పంచాయతీ కార్యదర్శి గంగా జమున పర్యవేక్షించారు.

సమస్యను విన్నవించిన వెంటనే తగిన చర్యలు తీసుకొని దారి మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించేందుకు సహకరించిన ఏఈ అన్నయ్యకు ఆరవ వార్డు కాలనీవాసుల తరపున సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరవ వార్డు సభ్యుడు లోలం సురేష్, లైన్ మెన్ అప్సర్, కాలనీవాసులు చిలుకన్నా, కలాలి భూమయ్య, కలాలి బాజన్న, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -