- Advertisement -
నవతెలంగాణ-తుంగతుర్తి:
తుంగతుర్తి మండల కేంద్రంలోని గ్రంథాలయ చైర్మన్‌గా వీరబోయిన గంగరాజు యాదవ్ నియమాకమయ్యారు. శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సామేలు చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని,తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే మందుల సామేలు,రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వంగవీటి రామారావు,మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకులు రేగటి రవి,సర్పంచ్ల ఫోరం మండల ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్,దాసరి శ్రీను,మాచర్ల అనిల్ క్యాస్ట్రో,కొండ రాజు,నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



