రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభంజనం

– టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌ గౌడ్‌, రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి
– ఆమనగల్‌ లో భారీ బైక్‌ ర్యాలీ
నవతెలంగాణ-ఆమనగల్‌
రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సష్టిస్తుందని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా కాంగ్రెస్‌ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతు మంగళవారం ఆమనగల్‌ కడ్తాల్‌ మండలాల్లోని మేడిగడ్డ, శంకర్‌ కొండ, కడ్తాల్‌ గానుగుమర్ల తాండా, మైసిగండి, గడ్డమీది తాండా, పెద్దవేములోని బావి తదితర గ్రామాల్లో వారు వేరు వేరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్‌ వైపే ఉన్నారని పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్‌ రెడ్డి తెలంగాణకు సీఎం కాబోతున్నారని అన్నారు. అడిగిన వారికి కాదనకుండా అన్ని విధాలుగా ఆదుకొని కల్వకుర్తి నియోజకవర్గం ప్రజల మనసు గెలుచుకున్న కసిరెడ్డి నారాయణరెడ్డిని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. గత పది సంవత్సరాలుగా మోసపూరిత వాగ్దానాలతో మభ్యపెడ్తున్న బీఆర్‌ఎస్‌ మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని వారు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను తూచ తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు. అదేవిధంగా ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని వారు పేర్కొన్నారు. హస్తం గుర్తుపై ఓటేసి కసిరెడ్డి నారాయణరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లను వేడుకున్నారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు సుంకిరెడ్డి వరప్రసాద్‌ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆమనగల్‌లో కసిరెడ్డి నారాయణరెడ్డికి మద్దతుగా కాంగ్రెస్‌ నాయ కులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమనగల్‌ పట్టణంలోని ప్రధాన విధులతో పాటు, శ్రీశైలం హైదరాబాద్‌ జాతీయ రహదారిపై కాంగ్రెస్‌ శ్రేణులు ర్యాలీ నిర్వహించి కసిరెడ్డి నారాయణరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నినాదాలు చేశారు. కార్యక్ర మంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు గుర్రం కేశవులు, వస్పుల జంగయ్య, కష్ణ నాయక్‌, వస్పుల మానయ్య, కాలే మల్లయ్య, ఖాదర్‌ ఖాద్రీ, వస్పుల శ్రీశైలం, అలీం, ఖాదర్‌, రహీం, నాసర్‌, కరీం, వస్పుల శ్రీకాంత్‌, ఫరీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love