Sunday, June 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వ్యకాస జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి 

వ్యకాస జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి 

- Advertisement -

డివిజన్ కార్యదర్శి కర్నాటి సుధాకర్ 
నవతెలంగాణ-మర్రిగూడ 
తిప్పర్తి మండలంలోని దుప్పలపల్లి కె ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ఈ నెల 12 న జరిగే వ్యవసాయ కార్మిక సంఘం 20 వ‌ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం డివిజన్ కార్యదర్శి కర్నాటి సుధాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని ఇందుర్తి గ్రామంలో మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాసభలలో బిజెపి ప్రభుత్వం తెచ్చిన విబిజి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని, పాత చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని కోరుతూ పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల కాలంలో నిర్వహించిన పోరాటాలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జరిగిన ఆందోళనలు సమీక్షించి భవిష్యత్ మూడు సంవత్సరాల పోరాటాలకు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ కార్మిక వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై రైతులు వ్యవసాయ కార్మికులు కలిసి ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావలసిన ఆవశ్యకత, ఉపాధి హామీ పథకంలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. వ్యవసాయ కార్మికులు,ఉపాధి హామీ కూలీల హక్కుల రక్షణకై జరుగుతున్న జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మండల అధ్యక్షురాలు దొడ్డి అనిత, గిరి యాదమ్మ, గిరి సరిత, దొడ్డి పద్మ, గుయ్యని సునీత, బండారి పార్వతమ్మ, దొడ్డి సాలమ్మ, చేపూరి రాములమ్మ, లలిత, ఎనమల్ల ఇందిరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -