Sunday, June 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ గ్రామపంచాయతీలో ప్రత్యేక గ్రామసభ

జుక్కల్ గ్రామపంచాయతీలో ప్రత్యేక గ్రామసభ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలోని జుక్కల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కర్రెవార్ సావిత్రి అధ్యక్షతన ఆదివారం ప్రత్యేక గ్రామసభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎజెండా అంశాల గురించి చదివి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారని జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ప్లాస్టిక్ నిషేధము ఘన వ్యర్థాలపై గ్రామస్థులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 2026-27 సంవత్సరానికి సంబంధించి జిపి డిపి యాక్షన్ ప్లాన్ లో పనులను గుర్తించామి తెలిపారు. ఓటర్ జాబితా సవరణ, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, వ్యవసాయ శాఖ, ఎలక్ట్రిసిటీ, ఆరోగ్యం, అంగన్వాడి, ఉపాధి హామీ పనులు, మిషన్ భగీరథ నీరు, పారిశుద్ధ్యము నిర్వాహన పై చర్చించి, తీర్మానం చేశామని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్, ఉప సర్పంచ్ ,పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ సభ ప్రత్యేక అధికారి గ్రిడ్ ఏఈ ఆఫ్రాన్, ఏపీవో తులసీరాం, గ్రామ పెద్దలు, గ్రామస్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -