నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలోని జెంటిల్ కిడ్స్ ప్లే స్కూల్ పాఠశాల దినదిన అభివృద్ధి చెందుతూ చిన్నారులను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. సీబీఎస్ ఈ పాఠ్య ప్రణాళికతో ఇటీవల ఎన్నో విజయాలు సాధించినట్టు పాఠశాల కరస్పాండెంట్ గుజరాతి ప్రకాష్ ఆదివారం తెలిపారు. జాతీయ స్థాయిలో అబాకస్ పోటీల్లో విజయం సాధించడం తోపాటు, రాష్ట్ర స్థాయి స్పోకెన్ ఇంగ్లీష్ పోటీల్లో విజేతగా నిలవడం జరిగిందని తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చిన్న పిల్లలకు కృత్రిమ మేధస్సు పరిచయం చేయడం, నైపుణ్యాభివృద్ధి పిల్లల్లో కమ్యూనికేషన్, కాగ్నిటివ్ (జ్ఞానాత్మక) నైపుణ్యాలను పెంపొందించడం,ప్లే-వే విధానం ఆటపాటల ద్వారా పిల్లలకు పాఠ్యవిషయాల పట్ల ఆసక్తిని కలిగించడం, ఆహ్లాదకర వాతావరణంలో పరిమిత విద్యార్థులు తరగతి గదిలో తక్కువ మంది పిల్లలను మాత్రమే ఉంచి, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చేస్తున్నామని తెలిపారు. పిల్లలను సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించడమే జెంటల్ కిడ్స్ ప్లే స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు.
క్రమశిక్షణకు మారుపేరుగా: గుజరాతి ప్రకాష్, కరస్పాండెంట్, జెంటిల్ కిడ్స్ ప్లే స్కూల్, ఆర్మూర
క్రమశిక్షణకు మారుపేరుగా చిన్నారులను చదువుతోపాటు ఆట పాటలలో ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నాం. మా పాఠశాలలో చదివిన విద్యార్థిని విద్యార్థులు ఉత్తమ గ్రేడులు సాధించడం ఎంతో గర్వకారణంగా ఉంది.



