Sunday, June 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములు కావాలి: ఎస్సై

మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములు కావాలి: ఎస్సై

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర 
మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందన్నారు. దీని ప్రభావం కుటుంబాలు, సమాజంపై తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల విక్రయాలు, రవాణా, వినియోగంపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గ్రామాలు, విద్యాసంస్థలు, ప్రజా ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, యువతను చైతన్యపరుస్తున్నామని చెప్పారు. ప్రజలు తమ పరిసరాల్లో ఎక్కడైనా మాదక ద్రవ్యాల విక్రయాలు, అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ఎస్సై పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -