Monday, June 8, 2026
E-PAPER
Homeసినిమా40 ఏళ్ళ కల నెరవేరింది : సింగీతం

40 ఏళ్ళ కల నెరవేరింది : సింగీతం

- Advertisement -

డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నై లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కమల్ హసన్ మాట్లాడుతూ,”మాయాబజార్ నుంచి ఇప్పటి 'సింగ్ గీతం వరకు సింగీతం శ్రీనివాసరావులో ఎలాంటి మార్పు లేదు. సినిమా ఆయనతో పాటే ఉంది. ఇది చాలా అరుదుగా జరిగే విషయం. నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాను. ఆయన సినిమాకి నిర్మాతగా, సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాను. చాలా ఏళ్ల క్రితం ఆయన నాకు రెండు కథలు చెప్పారు. అందులో ఒకటి పుష్పక విమానం సినిమాగా వచ్చింది. ఇప్పుడు రెండో కథ ‘సింగ్ గీతంసినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు ఆ కథ విన్నాను. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు. ఇప్పుడు ఆ సినిమాను చూడబోతున్నాను. కొన్ని ఆలోచనలు, కొన్ని కథలు టైమ్‌లెస్‌గా ఉంటాయి. సింగీతం కథలు కూడా అలాంటివే. అవి ఏజ్‌లెస్‌గా ఉంటాయి. సింగీతం ఇప్పటికి జెన్జీ కంటే ముందుంటారు. ఆయనను ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు.
‘ఈ చిత్రం 40 సంవత్సరాల కల. మాటలే పాటలైతే అనే ఆలోచనతో ఈ కథ పుట్టింది. నాగ్ అశ్విన్ సినిమా కంటే నన్నే ఎక్కువ ప్రేమించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ కథ ఆత్మను అద్భుతంగా పట్టుకున్నారు. ఆయన తప్ప ఈ సినిమాకు ఇంత అద్భుతమైన సంగీతం ఇంకెవరూ అందించలేరని నేను నమ్ముతున్నాను` అని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -