Sunday, June 7, 2026
E-PAPER
Homeసినిమాఅలరించే యూనిక్ కాన్సెప్ట్..

అలరించే యూనిక్ కాన్సెప్ట్..

- Advertisement -

హర్రర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంగా రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పోలీస్ కంప్లైంట్’. ఈ సినిమా ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించిన ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం నుంచి సూపర్‌స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతం విడుదలై, విశేష ఆదరణతో సినిమాకి మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ పాటను వీక్షించిన కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. పాట అద్భుతంగా వచ్చిందని ప్రశంసిస్తూ, సినిమా ఘన విజయం సాధించాలని తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణసాయి, కృతి వర్మలపై చిత్రీ కరించిన ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేష గిరిరావు మా చిత్రాన్ని, ముఖ్యంగా కృష్ణ పై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మెచ్చుకోవడం మా యూనిట్‌కు ఎంతో గర్వకారణం. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ చుట్టూ కథ సాగుతుంది. హర్రర్ థ్రిల్లర్ అంశాలతో పాటు యాక్షన్, ఎమోషన్స్ ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకం ఉంది` అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -