Monday, June 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్ ఆస్తులపై ట్రంప్ కన్ను

ఇరాన్ ఆస్తులపై ట్రంప్ కన్ను

- Advertisement -

గల్ఫ్ దేశాల పునర్నిర్మాణం కోసం వినియోగించాలని యోచన
వాషింగ్టన్/దుబాయి
: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఆస్తులపై కన్నేశారు. ఇరాన్ దాడులలో దెబ్బతిన్న గల్ఫ్ దేశాల పునర్నిర్మాణానికి, మరమ్మతులకు వాటిని వినియోగించాలని ఆయన భావిస్తున్నారు. ఇరాన్ దాడుల కారణంగా గల్ఫ్‌లోని మిత్ర దేశాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాల్సిందిగా అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ ఓ బృందాన్ని ఆదేశించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భవిష్యత్ లో ఇరాన్ దాడుల కారణంగా గల్ఫ్ మిత్రులకు జరిగే నష్టాన్ని పూడ్చడానికి కూడా ఆ ఆస్తులనే వినియోగించాలని అమెరికా అనుకుంటోందని ఆ వర్గాలు చెప్పాయి. వివిధ దేశాలలో ఇరాన్‌కు చెందిన 24 బిలియన్ డాలర్ల ఆస్తులను అమెరికా స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఆ నిధుల విడుదలకు అమెరికా ఇష్టపడకపోవడంతో శాంతి చర్చలు ముందుకు సాగడం లేదని ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా సలహాదారు మొహసిన్ రెజాయ్ చెప్పారు. ఇరాన్‌కు చెందిన ఏ ఆస్తులను అమెరికా ఆర్థిక శాఖ పరిశీలిస్తుందన్నది తెలియరాలేదు. అయితే స్తంభింపజేసిన ఆస్తులకే ఆ పరిశీలన పరిమితం కాబోదని తెలుస్తోంది. తన ఆస్తులను దారి మళ్లించి గల్ఫ్ దేశాల పునర్నిర్మాణానికి ఉపయోగించాలన్న అమెరికా ప్రణాళికపై ఇరాన్ మండిపడుతోంది. ఈ పరిణామం శాంతి చర్చలకు మరింత విఘాతం కలిగిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -