Monday, June 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాపై ఇజ్రాయిల్ గూఢచర్యం

అమెరికాపై ఇజ్రాయిల్ గూఢచర్యం

- Advertisement -

ట్రంప్ తో దోస్తి చేస్తూనే నెతన్యాహు నిఘా
వాషింగ్టన్
: దేశంలో ఇజ్రాయిల్ గూఢచర్య కార్యకలాపాలపై అంచనా వేసిన ప్రమాదం ఇటీవలి వారాలలో ‘అధిక’ స్థాయి నుంచి ‘తీవ్రమైన’ స్థాయికి చేరిందని పెంటగాన్ ఇంటెలిజెన్స్ విభాగం అభిప్రాయపడింది. ఇరాన్‌పై అమెరికా‘ఇజ్రాయిల్ సాగిస్తున్న పోరుపై అవలంబిస్తున్న వ్యూహాల విషయంలో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ మార్పు జరిగిందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఎన్‌బీసీ న్యూస్, న్యూయార్క్ టైమ్స్ తెలియజేశాయి. అమెరికా ఉన్నతాధికారులపై నిఘా పెట్టేందుకు ఇజ్రాయిల్ ముమ్మరంగా ప్రయత్నిస్తోందన్న భయాందోళనల మధ్య పెంటగాన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ) ఈ హెచ్చరిక స్థాయిని పెంచింది. యుద్ధానికి ముగింపు పలికేందుకు వైట్‌హౌస్‌లో జరుగుతున్న ఆంతరంగిక చర్చల గురించి సమాచారాన్ని సేకరించడమే ఇజ్రాయిల్ లక్ష్యమని ఆరోపణలు వస్తున్నాయి. మానవ గూఢచర్యం, సాంకేతిక నిఘా…ఈ రెండింటిలోనూ ఇజ్రాయిల్ సామర్ధ్యాన్ని వివరిస్తూ డీఐఏ ఓ సవివరమైన పత్రాన్ని రూపొందించిందని తెలుస్తోంది. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న తరుణంలో ఈ వార్త వెలుగు చూడడం గమనార్హం. అయితే ఈ వార్తను ఇజ్రాయిల్, అమెరికా ఖండించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -