శ్రామిక మహిళల రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల ప్రారంభంలో ఎస్వీ రమ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్థిక, రాజకీయ, సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములయినప్పుడే శ్రామిక మహిళలు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారం అవుతాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో శ్రామిక మహిళల రాజకీయ శిక్షణా తరగతులను ప్రారంభించారు. సమాజ పురోగమనానికి మహిళల పాత్ర కీలకమన్నారు. వ్యవసాయం మొదలుకుని పరిశ్రమలు, విద్య, వైద్యం, ఐటి సేవా రంగాల వంటి అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషి స్తున్నారని గుర్తు చేశారు. అదనంగా కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే సామాజ అభివృద్ధికి, దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ ఆమెను రెండో తరగతి పౌరురా లుగానే చూస్తు న్నారని చెప్పారు. వేతన వివక్ష, ఉద్యోగ భద్రత లేకపోవ డంతో పాటు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న రాజకీయ విధానాల వల్ల అసమా నతలు పెరుగు తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటి ప్రభావం మహిళలమీద ఎక్కువగా ఉందని చెప్పారు. ఆ విధానాల ఫలితంగా కుటుం బంలోనూ, పరిశ్రమలోనూ అదనపు పనిభారాన్ని మోయాల్సి వస్తున్న దన్నారు. ఈ నేపథ్యంలో సమాజాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. శ్రమ దోపిడి ఎక్కడ జరుగుతుందో తెలుసు కోవాలన్నారు. అదనపు పనిగంటలు పని చేస్తే ఎవరికి ఉపయోగం జరుగు తుందో అర్థం చేసుకోవాలన్నారు. అంతిమంగా వర్గ దోపిడికి మూలం ఎక్కడుందో తెలసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రాజకీయ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం. పద్మశ్రీ ఈ తరగతులకు ప్రిన్స్ పాల్ గా వ్యవహ రించారు. రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ శ్రాస్త్రీయ ఆలోచ అనే క్లాసును భోదించారు.
ఆర్థిక, రాజకీయ సామాజిక ఉద్యమాల్లో భాగం కావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


