నవతెలంగాణ-హైదరాబాద్ : నేషనల్ డీవార్మింగ్ డే సందర్భంగా పిల్లల్లో నులిపురుగుల నిరోధానికి ఇచ్చిన మాత్రలు వేసుకుని.. ఉత్తర్ ప్రదేశ్‌లో 120 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఫరూఖాబాద్, మెయిన్ పురి జిల్లాల్లో మంగళవారం నిర్వహించిన డీవార్మింగ్ కార్యక్రమంలో భాగంగా మాత్రలు వేసుకున్న.. 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అల్బెండజోల్ ఔషధం వేసుకున్న కాసేపటికే తలనొప్పి, వాంతులు చేసుకున్నారు. ఫరూఖాబాద్ జిల్లాలోని ప్రేమాదేవి మోహన్‌లాల్ పాఠశాలలో 150 మంది విద్యార్థులు ఆ మాత్రలు వేసుకోగా 100 మంది అస్వస్థతకు గురయ్యారు. మెయిన్‌పురి జిల్లాలో మరో 25 మందికి అలాగే జరిగింది. దీంతో యూపీలో రాజకీయ దూమారం రేగింది. విద్యార్థులకు నకిలీ మందులు ఇచ్చారని సమాజ్‌వాది పార్టీ ఆరోపించింది.
డీవార్మింగ్ డే..125 మంది విద్యార్థులకు అస్వస్థత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



