నితీశ్ కుమార్ రాజీనామా
గవర్నర్ సయీద్ అతా హస్నైన్ ఆమోదం
నేడు లోక్‌భవన్‌లో ప్రమాణస్వీకారం
తొలిసారి బీజేపీకి బీహార్ ముఖ్యమంత్రి పదవి
పాట్నా : గత కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను లోక్‌భవన్‌లో మంగళవారం నాడు గవర్నర్ లెఫ్టి నెంట్ జనరల్ (రిటైర్డ్) సయీద్ అతా హస్నైన్‌కు సమర్పిం చారు. ఈ మేరకు గవర్నర్.. నితీశ్ కుమార్ రాజీనామాను ఆమోదించారు. బీహార్ ముఖ్యమంత్రిగా గత 21 ఏండ్ల పాటు ఎక్కువ కాలం, ఎక్కువ సార్లు పాలించిన నితీశ్ ఇక రాష్ట్ర రాజకీ యాలకు దూరం కానున్నారు. నితీశ్ కుమార్ తన రాజీనామాకు ముందు తన చివరి రాష్ట్ర మంత్రివర్గ సమా వేశాన్ని నిర్వహిం చారు. మంత్రి మండలి రద్దు చేసే తన నిర్ణయం గురించి ఆయన తన మంత్రివర్గ సహచరులకు తెలియ జేశారు. బీహార్ నూతన సీఎంగా ఆ రాష్ట్ర ఉపముఖ్య మంత్రి సామ్రాట్ చౌదరీ నేడు బాధ్య తలు చేపట్ట నున్నారు. అంతకముందు ఆయనను బీజేపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆయనకు బీజేపీ కేంద్ర పరిశీలకులు శివరాజ్‌సింగ్ చౌహాన్, ఇతర నేతలు అభినందనలు తెలిపారు. కాగా బీహార్‌లో బీజేపీ తొలిసారిగా సీఎం కుర్చీని సొంతం చేసుకోనుంది. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రాష్ట్ర అసెంబ్లీ సెంట్రల్ హాల్‌లో అందరు ఎన్డీఏ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. కూటమి సభ్యుల మద్దతు ఉందనే సందేశాన్ని పంపడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాగా నేడు నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం నేడు రాజధాని పాట్నాలోని లోక్‌భవన్‌లో జరగనుంది. ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.
2025లో జరిగిన బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీలో 243 స్థానాలకు గానూ 202 సీట్లను కైవసం చేసుకుంది. ఇందులో 89 స్థానాలు గెలుచుకున్న బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. నితీశ్ కుమార్ నాయకత్వంలోని జేడీ(యూ)కు 85 మంది, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ (రామ్ విలాస్ పాశ్వాన్) 19 సీట్లను గెలుచుకున్నాయి. దీంతో నితీశ్ కుమార్ గతేడాది నవంబర్ 20న పదోసారి బీహార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
బీహార్ కొత్త సీఎం సామ్రాట్ చౌదరీ
- Advertisement -
- Advertisement -



