నవతెలంగాణ-హైదరాబాద్ : నెల్లూరు జిల్లా సంగం నుంచి కాశీకి వెళ్తున్న యాత్రికుల బస్సు ఆదివారం అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా వాసులు వెళ్తున్న బస్సు బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్ వద్దకు రాగానే రహదారి ప్రమాదానికి గురైంది. దీంతో ముగ్గురు జిల్లావాసులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 1న సంగం నుంచి 43 మంది యాత్రికులతో బస్సు బయల్దేరింది. ఆదివారం రాత్రి బీహార్ రాష్ట్రంలోని గయనుంచి వారణాసికి వెళ్లే క్రమంలో ఎన్‌హెచ్ 2 పై ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో బస్సులో ఎడమవైపు కూర్చొన్నవారిలో ముగ్గురు మృతి చెందారు. సంగం, ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన సుమారు 15 మంది గాయపడగా వారిని అక్కడే దగ్గరలో ఉన్న వైద్యశాలకు చికిత్సకు తరలించారు. రాష్ట్రప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఈ ప్రమాదం జిల్లాలో తీవ్ర ఆందోళన కలిగించింది.
బిహార్‌లో రోడ్డు ప్రమాదం..ముగ్గురు నెల్లూరు జిల్లా వాసులు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



