నయనతార, కవిన్ తొలిసారి కలిసి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్’ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఈనెల 28న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కె. భాగ్యరాజ్, ప్రభు, రాధికా శరత్‌కుమార్, వీటీవీ గణేష్, సత్యన్, ఆదిత్య కథిర్, ఖురైషి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజేష్ శుక్లా సినిమాటోగ్రఫీ అందించగా, జెన్ మార్టిన్ సంగీతం సమకూర్చారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా, ఎస్. కన్నన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. జీ స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్లపై నయనతార, విఘ్నేష్ శివన్, ఎస్.ఎస్. లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినోద్ సి.జే., కె.ఎస్. మయిల్ వాగనన్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, వి.కె. కుబీంద్రన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. దర్శకుడు విష్ణు మాట్లాడుతూ, ‘హాయ్’ టైటిల్‌లాగే ఇది ఒక సింపుల్, హార్ట్ వార్మింగ్, ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. చెన్నై, కోయంబత్తూరు, పొల్లాచ్చి నేపథ్యాల్లో సాగే ఈ సినిమా కుటుంబం మొత్తం కలిసి థియేటర్‌లో చూసి ఆస్వాదించేలా రూపొందించాం. ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’, ‘సంతోష్ సుబ్రమణ్యం’, ‘యారాడి నీ మోహిని’ వంటి చిత్రాల తరహాలో బంధాలు, భావోద్వేగాలు, హాస్యంతో సాగే కథ ఇది’ అని తెలిపారు.
‘హాయ్’ రిలీజ్ ఎప్పుడంటే?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



