Friday, August 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఊహించిన దాని కంటే అద్భుత స్పందన

ఊహించిన దాని కంటే అద్భుత స్పందన

- Advertisement -

హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఈనెల 6న జరిగిన ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 7న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు. హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ, ‘నిన్న సాయంత్రం ప్రీమియర్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా అనిపించింది. మొదటి నుంచి ఈ సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన ప్రేక్షకుల నుంచి వచ్చింది. ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్య వాదాలు. సినిమాలోని ప్రతి ఎపిసోడ్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. సత్య కామెడీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. రానున్న రోజుల్లో సినిమా ఇంకా గొప్ప ముందుకు వెళ్తుంది. శిరీష్ ఎడిటింగ్ దశలోనే సినిమా చూసి, ‘మీరు మంచి సినిమాతో వస్తున్నారు’ అని మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆయన నమ్మకం ఈరోజు నిజమైంది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవాలని ఈ సినిమా చేశాం. ఇప్పుడు థియేటర్లలో వాళ్లు అలా ఎంజాయ్ చేస్తుంటే అంతకంటే ఆనందం ఇంకే ముంటుంది. తమన్‌తో పాటు మా టెక్నికల్ టీమ్ మొత్తం ఒక కుటుంబంలా కలిసి పని చేసింది. బాబు పుట్టిన తర్వాత ఈ సక్సెస్ రావడం నాకు మరింత స్పెషల్‌గా అనిపిస్తోంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -