అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సం యుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘పళ్ళ బురుసు’. ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని నిర్మాతలు. ఉదయ్ చౌహాన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, గోమతి, ప్రజ్వల్ యాద్మ, సుజాత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈనెల 14న సినిమా విడుదల కానుండగా, తాజాగా నాగార్జున అక్కినేని ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్‌ను డిజిటల్ విడుదలకు ముందే సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట గ్రామ ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున లచ్చపేట ప్రజలకు కృతజ్ఞతలు తెలిపే వీడియోను ప్రదర్శించారు. నాగార్జున మాట్లాడుతూ,‘సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. ‘పళ్ళ బురుసు’ సినిమా షూటింగ్ లచ్చపేట గ్రామంలోనే జరిగింది. అందుకే ఈ ట్రైలర్‌ను ముందుగా మీ అందరికీ చూపించి విడుదల చేయాలనుకున్నాం. మీ అందరి ప్రేమ, ఆదరణ చూసి చాలా ఆనందంగా అనిపించింది’ అని అన్నారు.
ఆద్యంతం నవ్విస్తుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



