Friday, August 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅంచనాలు పెరుగుతున్నాయ్‌..

అంచనాలు పెరుగుతున్నాయ్‌..

- Advertisement -

సూర్య కథానాయకుడిగా నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ట్రైలర్‌లో సంజయ్ విశ్వనాథ్ అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రను పరిచయం చేశారు. నలభై ఏళ్ల వయస్సు దాటినా తన కలలను వదలకుండా ముందుకు సాగే వ్యక్తిగా సూర్య కనిపించారు. వెంకీ అట్లూరి హృదయానికి హత్తుకునే రచనతో కలిసి సూర్య కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రల్లో ఇది ఒకటిగా నిలుస్తుందనే నమ్మకాన్ని ట్రైలర్ కలిగిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఈ స్వాతంత్ర్య దినోత్సవ వారాంతంలో ప్రేక్షకులకు మరపురాని భావోద్వేగ ప్రయాణాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -