Friday, August 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘డిసి’ విజయం.. మరోసారి నిరూపించింది

‘డిసి’ విజయం.. మరోసారి నిరూపించింది

- Advertisement -

లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన సినిమా ‘డిసి’. ఈ చిత్రాన్ని అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ నిర్మించింది. శుక్రవారం ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రం తెలుగులో విడుదలై, అద్భుతమైన స్పందనతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ,‘ఈ ‘ సినిమాకు వస్తున్న రిపోర్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. సన్ పిక్చర్స్‌కు ధన్యవాదాలు. ఏషియన్ సునీల్, దిల్ రాజు మేమంతా కలిసి ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాం. లోకేష్ కనగరాజ్ పెద్ద దర్శకుడు. ఇప్పుడు మొదటిసారి హీరోగా నటించారు. అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చారు. సినిమా అద్భుతమైన రెస్పాన్స్‌తో ప్రారంభ మైంది. అన్ని వైపుల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. హై రేటింగ్స్ వస్తున్నాయి. చాలా గొప్ప టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన సినిమా ఇది. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనేది ఈ సినిమా మరోసారి నిరూపించింది. అరుణ్ మాథేశ్వరన్ అద్భుతంగా తెరకెక్కించారు. వామికా గబ్బి, మిగతా నటీనటులు చాలా బాగా నటించారు. ప్రతి షోకి ఆదరణ పెరుగుతోంది. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు. ‘ముందుగా ఈ సినిమా హక్కులు మాకు ఇచ్చిన సన్ పిక్చర్స్‌కు ధన్యవాదాలు. ‘డీసీ’ అన్ని చోట్ల విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది. ఇది బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది’ అని నిర్మాత సునీల్ నారంగ్ చెప్పారు. నిర్మాత శిరీష్ రెడ్డి మాట్లాడుతూ,‘ఇంత గొప్ప విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా హక్కులు మాకు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన సన్ పిక్చర్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. అన్ని ప్రాంతాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -