Friday, August 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుచాలా గర్వంగా ఉంది

చాలా గర్వంగా ఉంది

- Advertisement -

వర్టికల్ స్టోరీస్‌లో చాయ్ షాట్స్ నుంచి వచ్చిన ‘దందా’ సిరీస్ సెన్సేషనల్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘దందా’తో దర్శకుడు ఆదిత్య దేవులపల్లి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు. మా ప్రొఫెసర్ అమృత్ కి సినిమా అంటే పిచ్చి. ఆయన వల్లే ఫ్రెంచ్, ఇంగ్లీష్‌తో సహా వరల్డ్ సినిమా వైపు నా చూపు మళ్ళింది. ఆ క్రమంలోనే చాయ్ బిస్కెట్ అనురాగ్ కి ఓ వైలెంట్ కథ నరేట్ చేశా. నేను ఎప్పుడు అనుకునే వాడిని నేను 28 సంవత్సరాల కల్లా డైరెక్టర్ అవ్వాలని, అయ్యాను. ఇప్పటివరకు ‘దందా’కి ఒక్కటంటే ఒక్క నెగెటివ్ రివ్యూ కూడా రాలేదు. ప్రతీ ఒక్కరూ ఈ ఫ్రెష్ మేకింగ్ స్టైల్, స్ట్రాంగ్ కంటెంట్‌ను విపరీతంగా పొగుడుతున్నారు. మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. పెద్ద పెద్ద సెలెబ్రిటీలు సైతం అనురాగ్కి ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ప్రతీ సీన్ చాలా ఫాస్ట్ పేస్డ్‌గా, ఎంగేజింగ్‌గా ఉం దంటుంటే చాలా గర్వంగా ఉంది. నేను ‘దందా’ని 100% ఎంటర్‌టైన్‌మెంట్ మైండ్‌సెట్‌తోనే తీశాను. అలాగే సమాజానికి ఉపయోగపడే సైబర్ క్రైమ్స్ వెనుక ఉన్న దారుణాలను వారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూపించాం. ప్రస్తుతం ఒక 50 ఏళ్ల నేరస్థుడి చుట్టూ తిరిగే పవర్‌ఫుల్ స్టోరీ రాస్తున్నా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -