- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సోమవారం నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి సౌకర్యార్థం అధికారులు నాంపల్లికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. చేప ప్రసాదం తీసుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వేలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. మృగశిర కార్తె సందర్భంగా దశాబ్దాలుగా చేప ప్రసాదం పంపిణీ జరుగుతోంది.
- Advertisement -



